Friday 20 April 2012

తార చాటు చంద్రులు

తారా చౌదరి లాంటి నీచ స్త్రీలు, అత్యాశ తో దారి తప్పేవాళ్ళెప్పుడూ ఉంటూనే ఉంటారు.
మనకి బాధ కలిగించే విషయం ఏమిటంటే, అలాంటి వాళ్ళ వలలో పడ్డ మూర్ఖులు అంత పెద్ద పెద్ద పదవుల్లో ఉండడం.

ఇప్పటికే, తార తమ పేరు చెప్పకుండా ఉండడానికి పాతిక కోట్లు వరకూ ఆమెకి అందినట్లు న్యూసు.
ఇలాంటి చెడ్డ పనులకి అంత పెద్ద మొత్తం సమకూరడం నిజంగా బాధ కలిగించే విషయమే.

ఈవ్యవహారంలో ఇరుక్కున్న పెద్దలెవరో గాని, మీడియా లో తమ పేరు రాకుండా తెగ ప్రయాస పడుతున్నట్టు మాత్రం న్యూసులో ప్రస్ఫుటంగా తెలుస్తోంది.
అసలు మనదేశంలో ఇంత విచ్చలవిడితనం ఏంటి? పదవిలో ఉంటే ఎంతకైనా తెగించి తిరగటం ఏంటి?
అంతేగాకుండా, సామాన్యుడికి వంద రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో, ఈ పిచ్చి పనులకి అంత డబ్బు సర్క్యులేట్ అవడం ఏంటి?

తార వ్యవహారంలో అసలు సమస్య కేవలం వ్యభిచారం కాదు. ఆమె వెనుక దాగి ఉన్న పెద్దలు - వాళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు - తమని తాము కాపాడుకోడం కోసం వాళ్ళు తొక్కే అడ్డదారులు - ఇవీ సమాజాన్ని బాధ పెట్టే సమస్యలు.

Friday 6 April 2012

శ్రీ ఆంజనేయ జయ మంత్రం

శ్రీ రామ దాసాంజనేయాయ నమః

జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!

దాసోహం కౌసలేంద్రస్య రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!

నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రహః !!

అర్ధయిత్వాం పురీం లంకాం మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రాక్షసాం !!


హనుమానాంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖా పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః
ద్వాదశాత్మాని నామాణి కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్ 

ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

Thursday 5 April 2012

తెలుగు సినీమా కి పట్టిన తెగులేంటి?



రామ రామ. ఒకటని ఏమి చెప్పగలం. బట్టతల ఉన్న పెద్దాయనని సార్ మీ జుట్టు ఎందుకు ఊడింది అని అడిగితే ఏమని చెప్పగలరు?
ఇదీ అంతే.
మన తెలుగు సినీమా పూర్తిగా కాపీల కూపం.  మైక్రోసాఫ్ట్స్ వాడికి కాపీ పేస్ట్ ఐడీయా మన వాళ్ళ నించే అని కొందరి అభిప్రాయం.
ఇదివరకు ప్రొడ్యూసెర్స్ కి తెలుగు సినిమా తీద్దామని ఉండేది.  ఇప్పుడు ఏ సినిమా ని తెలుగులో తీద్దామనే ఐడియా తో మొదలు పెడుతున్నారు. కధాపరంగా చూస్తే గత 75 ఏళ్ళలో లెఖ్ఖపెట్ట తగినవి తెలుగు సినిమాలు ఐదో ఆరో. 
కొంతమంది ప్రేక్షకులు తప్పనిసరిగా ఏదొ ఒక సినిమా చూడడం  తప్పిస్తే సరదాగా సినిమా కి కుటుబంతో వెళ్ళే రోజులు పోయాయి.
అసలు తెలుగు సినిమా వాళ్ళకి పైరసి గురించి మాట్లాడె హక్కు ఉందా?
కధల దగ్గర్నించి అంతా పైరసీయే కదా?
పోని పాటలు ఫైట్లు చూద్దామంటే, కొన్ని మూవ్మెంట్స్ కి పిల్లలకి కళ్ళు మూయడమో, ఐదురూపాయల నాణెం కింద పడేసి వెతక మనటమో చెయ్యాలి. అదొక దండగ!
ఇటీవల సినిమాల్లొ కొంతమంది హిరోలు, డాన్సర్లు హిరోయిన్లు కెమెరా మీదకి తమ కాళ్ళతొ తన్నటం లేదా తమ అధోభాగాలని కెమేరా కేసి చూపించడం. ఆ చెత్త అంతా మనం చూసి త(భ)రించడం. ఇంత బాధ్యతారహితంగా సినిమాలు తీస్తే బతికి బట్టకడతాయా?
ఎంత ఏజ్ వచ్చినా ఇమేజ్ కోసం సినీమాని డామేజ్ చేసే హిరోలు, భాషాభావాల్తొ పనిలేని హీరోయిన్లు, ముందే చూసిన సినిమాలని రీ-ప్రెసెంట్ చేసే దర్శకులు, కలెక్షన్స్ తో పాటూ మంచి విలువలు కూడా అవసరమని భావించని నిర్మాతలు, ధియేటర్కి వస్తే పిచ్చి ధరలతో ప్రేక్షకుడిని చావబాదే హాల్సు. ఇవీ ముఖ్యంగా తెలుగు సినిమాకి పట్టిన తెగుళ్ళు. 
తమ సమస్యల్ని, చిరాకులని కాసేపు పక్కన పెట్టి సరదాగా సినీమా చూద్దామనే ప్రేక్షకుడికి తెలుగు సినిమా చూపించే 'చిత్రం' ఇదీ. 


ప్రేక్షకుడికి సినిమా ని పెన్ డ్రైవ్ లోనో, మొబైల్లోనో, టీవీలోనో చూస్తే చాల్లే అనే భావన వచ్చిందంటే తప్పు ఎవరిది?


om Sree Subhrahmanyaaya namaha


శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం !
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం !!


కనక కుండల మండన మండితం వనజరాజ విరాజిత లోచనం !
నిఖిలశస్త్ర శరానన భాసితం శరణోధ్భవ మీశ సుతం భజే !!

Wednesday 4 April 2012

jai sree ganesaaa



శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.

అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే

Tuesday 3 April 2012

I P L opening ceremony


ఐ పీ ఎల్ ప్రారంభోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది. ఐతే ఎంతో expect చేస్తే కనీసం SAF ఓపెనింగ్ రేంజ్ లో కూడా లేదు. అందుకే అంటారేమో Expectation is mother of dissatisfaction అని.

ఇంకొంచెం బాగా Organise చెయ్యాల్సింది అనిపించింది.
anyhow, Lets expect more fair game this time.

Sunday 1 April 2012


అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
ధన్యవాదములతో సుధాకర్ వాడ్రేవు.