Thursday 5 April 2012

తెలుగు సినీమా కి పట్టిన తెగులేంటి?



రామ రామ. ఒకటని ఏమి చెప్పగలం. బట్టతల ఉన్న పెద్దాయనని సార్ మీ జుట్టు ఎందుకు ఊడింది అని అడిగితే ఏమని చెప్పగలరు?
ఇదీ అంతే.
మన తెలుగు సినీమా పూర్తిగా కాపీల కూపం.  మైక్రోసాఫ్ట్స్ వాడికి కాపీ పేస్ట్ ఐడీయా మన వాళ్ళ నించే అని కొందరి అభిప్రాయం.
ఇదివరకు ప్రొడ్యూసెర్స్ కి తెలుగు సినిమా తీద్దామని ఉండేది.  ఇప్పుడు ఏ సినిమా ని తెలుగులో తీద్దామనే ఐడియా తో మొదలు పెడుతున్నారు. కధాపరంగా చూస్తే గత 75 ఏళ్ళలో లెఖ్ఖపెట్ట తగినవి తెలుగు సినిమాలు ఐదో ఆరో. 
కొంతమంది ప్రేక్షకులు తప్పనిసరిగా ఏదొ ఒక సినిమా చూడడం  తప్పిస్తే సరదాగా సినిమా కి కుటుబంతో వెళ్ళే రోజులు పోయాయి.
అసలు తెలుగు సినిమా వాళ్ళకి పైరసి గురించి మాట్లాడె హక్కు ఉందా?
కధల దగ్గర్నించి అంతా పైరసీయే కదా?
పోని పాటలు ఫైట్లు చూద్దామంటే, కొన్ని మూవ్మెంట్స్ కి పిల్లలకి కళ్ళు మూయడమో, ఐదురూపాయల నాణెం కింద పడేసి వెతక మనటమో చెయ్యాలి. అదొక దండగ!
ఇటీవల సినిమాల్లొ కొంతమంది హిరోలు, డాన్సర్లు హిరోయిన్లు కెమెరా మీదకి తమ కాళ్ళతొ తన్నటం లేదా తమ అధోభాగాలని కెమేరా కేసి చూపించడం. ఆ చెత్త అంతా మనం చూసి త(భ)రించడం. ఇంత బాధ్యతారహితంగా సినిమాలు తీస్తే బతికి బట్టకడతాయా?
ఎంత ఏజ్ వచ్చినా ఇమేజ్ కోసం సినీమాని డామేజ్ చేసే హిరోలు, భాషాభావాల్తొ పనిలేని హీరోయిన్లు, ముందే చూసిన సినిమాలని రీ-ప్రెసెంట్ చేసే దర్శకులు, కలెక్షన్స్ తో పాటూ మంచి విలువలు కూడా అవసరమని భావించని నిర్మాతలు, ధియేటర్కి వస్తే పిచ్చి ధరలతో ప్రేక్షకుడిని చావబాదే హాల్సు. ఇవీ ముఖ్యంగా తెలుగు సినిమాకి పట్టిన తెగుళ్ళు. 
తమ సమస్యల్ని, చిరాకులని కాసేపు పక్కన పెట్టి సరదాగా సినీమా చూద్దామనే ప్రేక్షకుడికి తెలుగు సినిమా చూపించే 'చిత్రం' ఇదీ. 


ప్రేక్షకుడికి సినిమా ని పెన్ డ్రైవ్ లోనో, మొబైల్లోనో, టీవీలోనో చూస్తే చాల్లే అనే భావన వచ్చిందంటే తప్పు ఎవరిది?


No comments:

Post a Comment