Friday 20 April 2012

తార చాటు చంద్రులు

తారా చౌదరి లాంటి నీచ స్త్రీలు, అత్యాశ తో దారి తప్పేవాళ్ళెప్పుడూ ఉంటూనే ఉంటారు.
మనకి బాధ కలిగించే విషయం ఏమిటంటే, అలాంటి వాళ్ళ వలలో పడ్డ మూర్ఖులు అంత పెద్ద పెద్ద పదవుల్లో ఉండడం.

ఇప్పటికే, తార తమ పేరు చెప్పకుండా ఉండడానికి పాతిక కోట్లు వరకూ ఆమెకి అందినట్లు న్యూసు.
ఇలాంటి చెడ్డ పనులకి అంత పెద్ద మొత్తం సమకూరడం నిజంగా బాధ కలిగించే విషయమే.

ఈవ్యవహారంలో ఇరుక్కున్న పెద్దలెవరో గాని, మీడియా లో తమ పేరు రాకుండా తెగ ప్రయాస పడుతున్నట్టు మాత్రం న్యూసులో ప్రస్ఫుటంగా తెలుస్తోంది.
అసలు మనదేశంలో ఇంత విచ్చలవిడితనం ఏంటి? పదవిలో ఉంటే ఎంతకైనా తెగించి తిరగటం ఏంటి?
అంతేగాకుండా, సామాన్యుడికి వంద రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో, ఈ పిచ్చి పనులకి అంత డబ్బు సర్క్యులేట్ అవడం ఏంటి?

తార వ్యవహారంలో అసలు సమస్య కేవలం వ్యభిచారం కాదు. ఆమె వెనుక దాగి ఉన్న పెద్దలు - వాళ్ళు అక్రమంగా సంపాదించిన ఆస్తులు - తమని తాము కాపాడుకోడం కోసం వాళ్ళు తొక్కే అడ్డదారులు - ఇవీ సమాజాన్ని బాధ పెట్టే సమస్యలు.

No comments:

Post a Comment